టాలీవుడ్ స్టార్ హీరోస్ గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త తరహాలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు వినాయక్ హీరోగా మొదటి సినిమాతోనే ప్రస్తుత జనరేషన్ కి తగ్గట్టుగా డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. సీనయ్య అనే టైటిల్ కొంచెం పాతగానే ఉన్నా సినిమాలో ఎమోషన్ రియాలిటీగా ఉంటుందట.  

దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నాడు అన్నప్పుడే సినిమాపై అంచనాల డోస్ పెరిగింది. ఇక వినాయక్ లాంటి దర్శకుడిని ఎవరు ఊహించని విధంగా కథానాయకుడిగా సెలెక్ట్ చేసుకోవడం మరింత హైప్ ని క్రియేట్ చేసింది. అలాగే సినిమా లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వినాయక్ మెగాస్టార్ స్టైల్ ని ఫాలో అయినట్లు తెలుస్తోంది. బహుశా సినిమాలో మెగా అభిమానిగా కనిపిస్తాడేమో?..

ఆ సంగతి పక్కనపెడితే.. ఇసినిమాకు సంబందించిన మరో అప్డటే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యేలా కనిపిస్తోంది.  స్క్రీన్ ప్లేతో దర్శకుడు కథను నడిపించే విధానం సరికొత్తగా ఉంటుందట. మెకానిక్ గ పనిచేసుకునే సీనయ్య తన కూతురిని చంపిన వారిపై ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనే లైన్ పై సినిమా నడుస్తుందట.

స్టోరీ రొటీన్ అయినప్పటికీ రివెంజ్ డ్రామా డిఫరెంట్ ఉంటుందని రియాలిటీ ఎమోషన్ సినిమా స్థాయిని పెంచుతుందని ఇన్ సైడ్ టాక్. మరి చిత్ర యూనిట్ వేసుకున్న ప్లాన్స్ తెరపై ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఏ సినిమాకు నరసింహా దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందించనున్నారు.