Asianet News TeluguAsianet News Telugu

సీనియర్‌ డైరెక్టర్‌ పెద్ద మనసు.. పేద కళాకారులకు వినాయక్ సాయం

కరోనా ప్రభావంతో అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా దారుణంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో పేద సినీ క‌ళాకారులు, టెక్నీషియ‌న్ల అవ‌స‌రాల కోసం 'మ‌నం సైతం' ద్వారా రూ. 5 ల‌క్ష‌లు సాయం అంద‌జేశారు ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్‌. 

VV Vinayak Donated 5 Lakhs For Film Workers
Author
Hyderabad, First Published Mar 25, 2020, 1:31 PM IST

కరోనా ప్రభావంతో అని రంగాలు నిలిచిపోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో రోజువారి కూలీతో బతికే చాలామంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. ముఖ్యంగా షూటింగ్స్ నిలిచిపోవ‌డంతో రోజువారీ వేత‌నంతో బ‌తికే పేద క‌ళాకారులు, టెక్నీషియ‌న్స్ ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ ముందుకు వ‌చ్చారు.

సీనియర్‌ న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న 'మ‌నం సైతం' ఫౌండేష‌న్‌కు రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేశారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుక్కోవ‌డానికి కూడా ఇబ్బందులు ప‌డుతున్న పేద సినీ క‌ళాకారులు, సాంకేతిక విభాగాల్లో ప‌నిచేసే కార్మికులు మ‌నం సైతంను సంప్ర‌దించి, వాటిని పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యాన్ని ఒక వీడియో సందేశం ద్వారా వినాయ‌క్ వెల్ల‌డించారు. ఆయ‌న మాట్లాడుతూ, `ఈరోజు అంద‌ర్నీ వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను మ‌న ఇళ్ల‌ల్లో మ‌నం ఉండి వ‌ణికించాలి.

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని పేద క‌ళాకారులు, టెక్నీషియ‌న్లు, డాన్స‌ర్లు, ఫైట‌ర్లు.. ఎవ‌రైనా కానివ్వండి.. నెల రోజుల పాటు షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు. వాళ్ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 ల‌క్ష‌ల చెక్కును మ‌నం సైతం కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్‌కు అంద‌జేస్తున్నా. నిజంగా ఎవ‌రికి అవ‌స‌ర‌మో వారు కాదంబ‌రి కిర‌ణ్ గారిని సంప్ర‌దించి, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా" అని చెప్పారు. నిరంత‌రం పేద సినీ క‌ళాకారుల సంక్షేమం కోసం ప‌రిత‌పిస్తోన్న 'మ‌నం సైతం' ఫౌండేష‌న్‌ను ఈ సంద‌ర్భంగా వినాయ‌క్ ప్ర‌శంసించారు. అందుకే ఆ ఫౌండేష‌న్ ద్వారా త‌న వంతుగా ఈ చిన్న సాయాన్ని చేస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios