డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా పరిచయమవుతూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దర్శకుడిగా తెర వెనక యాక్షన్ చెప్పిన వినయ్.. ఇప్పుడు మరో దర్శకుడు యాక్షన్ చెప్తే, యాక్ట్ చేస్తున్నారు.

కియారా క్లీవేజ్ షో... చూపరులకు పండగే

 'ఠాగూర్', 'ఖైదీ నెం:150' సినిమాల్లో కొద్దిసేపు తెరపై తళుక్కుమన్న వినాయక్‌ను పూర్తిస్థాయి హీరోగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా నిర్మాత దిల్ రాజు, లాంచ్ చేస్తూ సినిమా మొదలెట్టారు. ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ‘సీనయ్య’ (కంప్లీట్ ఎమోషన్) అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమాని దిల్ రాజు హోల్డ్ లో పెట్టారని మీడియా వర్గాల సమాచారం.

ఇప్పటికే ఈ చిత్రం కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ జరిగిందని, అయితే ఈ సినిమా రషెష్ ని రీసెంట్ గా దిల్ రాజు చూసి నిరుత్సాహపడ్డారని తెలుస్తోంది. దాంతో అవుట్ ఫుట్ బాగోలేదని, స్క్రిప్టు వర్క్ చేసుకుని మళ్లీ రీషూట్ చేసి,మొదటి నుంచీ తీయమని దర్శకుడుకు పురమాయించినట్లు సమాచారం. వినాయిక్ లుక్ సైతం తనకు నచ్చలేదని, పాత్ర ప్రకారం నడివయస్సు ఉండే హీరోనే కాబట్టి వినాయిక్ ..గతంలోలాగ ఉంటే సరిపోతుందని, డైటింగ్, ఎక్సరసైజులు ఆపేయమని చెప్పినట్లు వినికిడి. దాంతో మనం రెగ్యులర్ గా చూసే వినాయిక్ నే ఈ సినిమాలో చూసే అవకాసం దిల్ రాజు కల్పించబోతున్నరాన్నమాట.

ఇక ఈ చిత్రం  ఫస్ట్ లుక్‌లో ఆయన మెడలో ఎర్ర కండువాతో.. పెద్ద రెంచీ పట్టుకుని ఉన్నారు. గ్యారేజ్ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే మెకానిక్‌గా కనిపించనున్నారని అర్థమవుతుంది. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, మాటలు : డార్లింగ్ స్వామి, ఆర్ట్ : కిరణ్ కుమార్, నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి.