బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ లలో ఒకరి విజేత కావడం ఖాయం అని అంతా ఇప్పటివరకు భవిస్తూ వచ్చాడు. కానీ అనూహ్యంగా రేసులోకి రాహుల్ దూసుకొచ్చాడు. శ్రీముఖితో రాహుల్ తలపడుతున్న కారణంగా అతడికి అభిమానుల్లో క్రేజ్ పెరుగుతోంది. 

ఈవారం ఎలిమినేషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్ లో హౌస్ లో ఉన్న ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీకెండ్ వచ్చేయడంతో జరిగిన ఓటింగ్ పై అంచనాలు మొదలయ్యాయి. వితిక, శివజ్యోతి ఇద్దరూ ఓటింగ్ లో వెనుకబడ్డట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

శివజ్యోతి, వితిక లలో వితికపై ప్రేక్షకుల్లో ఎక్కువగా వ్యతిరేకత కనిపిస్తోంది. షో ఆరంభంలో నామినేషన్ లో ఉన్న వితిక ఆ తర్వాత బయటపడుతూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నామినేషన్ లో ఉండడంతో.. వితిక దొరికింది.. ఇక ఆమెని సాగనంపుతాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. 

వితిక స్వార్థంగా ఆలోచిస్తుందని, ఆమె ఉండడం వల్ల వరుణ్ కూడా నిజాయతీగా గేమ్ ఆడడం లేదనే విమర్శలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఇక శివజ్యోతి పూర్తిగా సేఫ్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే శివజ్యోతిని వ్యతిరేకించే ప్రేక్షకులు కూడా ఉన్నారు. దీనితో వితిక, శివజ్యోతి లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది.