ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విశ్వక్ సేన్. ఫలక్ నుమా దాస్ చిత్రంతో నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక నాని ప్రొడక్షన్ లో చేసిన 'హిట్' మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. నాని మరో మంచి సినిమాతో ఆడియెన్స్ కి తన ప్రొడక్షన్ వాల్యూ ని చూపించాడని తెలుస్తోంది. సినిమా చూసిన ప్రవాసులు ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా చివరి వరకు మెయిన్ ట్విస్ట్ తో మంచి సస్పెన్స్ క్రియేట్ చేశారని అంటున్నారు. యువ దర్శకుడు శైలేష్ సరికొత్త సీన్స్ తో థ్రిల్లర్ జానర్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడని అంటున్నారు.  

ఇక కథానాయకుడు విశ్వక్ సేన్ ఒక స్పెషల్ ఆఫీసర్ గా కథకు తగ్గట్టు తనలోని కొత్త నటుడిని బయటపెట్టాడు. మెయిన్ గా క్లయిమాక్స్ ట్విస్ట్ లో విశ్వక్ చూపించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఓ వర్గం నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటున్న 'హిట్' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టయ్యేలా కనిపిస్తోంది. నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో రూపొందిన ఈ సినిమా రుహాణి శర్మ హీరోయిన్ గా నటించింది.