Asianet News TeluguAsianet News Telugu

‘దాస్ కా ధమ్కీ’ప్రీ రిలీజ్ బిజినెస్ తో ట్రేడ్ కు దమ్కీ

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ధ‌మ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జ‌రిగిన‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. 

Vishwak Sen Das Ka Dhamki Pre Release Business Details
Author
First Published Mar 21, 2023, 10:23 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరో కమ్ దర్శకుడుగా రూపొందిన తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). వన్మయే క్రియేషన్స్, విశ్వక్‌సేన్ సినిమాస్ బ్యానర్లపై విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈ సినిమాను నిర్మించారు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.  దానికి తోడు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా రావడంతో సినిమాకు మరింత ప్రచారం దక్కింది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఎంత జరిగింది...బ్రేక్ ఈవెన్ లెక్కలు ఓ సారి చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ధ‌మ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జ‌రిగిన‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో క‌లిపి ఏడున్న‌ర కోట్ల‌కుపైగా ధ‌మ్కీ సినిమాథియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. విశ్వక్సేన్ సినిమాకు ఈ స్దాయి బిజినెస్ రావటంతో ట్రేడ్ కు ధమ్కీ తగిలినట్లే అంటున్నారు.

నైజాం ఏరియాలో మూడు కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు వినికిడి. అలాగే ఆంధ్రాలో మూడు కోట్లు, సీడెడ్‌లో ఎన‌భై ల‌క్ష‌లు, ఓవ‌ర్‌సీస్‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో క‌లిపి కోటి వ‌ర‌కు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు స‌మాచారం. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే ఓవ‌రాల్‌గా ఎనిమిది కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌స్తేనే   సేఫ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాల రిలీజ్‌లు లేక‌పోవ‌డంతో ధ‌మ్కీ సినిమాకు భారీగానే థియేట‌ర్లు దొరుకుతున్నాయి.

 ‘ఈ సినిమా ఎందుకు చూడాలంటే.. ఆగం ఆగం అయితారు సెకండాఫ్‌లో. ఉన్నకాడుండరు.. బాత్‌రూం పోలేరు. మొత్తం ట్విస్టులుంటాయి. ఊపేస్తది.. చెమలొస్తయి.. గుండె బరువైతది.. పరేషాన్ పరేషాన్ అయితది. సినిమా థియేటర్ నుంచి బయటికి వచ్చినాక పిచ్చి పిచ్చిగా ఉంటది’ అని విశ్వక్ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ మాటలు రాశారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ అందించారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా పనిచేసిన ఈ సినిమాకు ఎ.రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్, మహేష్ తదితరులు నటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios