బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కవచం’.గతేడాది తెలుగులో డిసెంబర్‌ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ప్లాఫ్ టాక్ అందుకుంది. శ్రీనివాస్‌ మామిళ్ల ‘కవచం’కు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. తమిళంలో రాక్షసుడు చిత్రంలో హీరోగా నటించిన విష్ణు విశాల్ ఈ రీమేక్ లో చేయబోతున్నారు. ఇదీ పోలీస్ పాత్ర కావటంతో విష్ణు విశాల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళం కోసం కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే తమిళంలో చేయటానికి కారణం ఉందని తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది కానీ హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు.  అక్కడ సినిమా రికార్డు సృష్టించింది. హిందీలో ఈ చిత్రం ‘ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌’ టైటిల్‌తో విడుదలైంది.  కేవలం ఇరవై నాలుగు గంటల్లో యూట్యూబ్‌లో ఈ చిత్రాన్ని కోటి 60 లక్షల మంది చూసారు.  ఆ రికార్డ్ చూసిన విష్ణు విశాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

ఒక మంచి థ్రిల్ల‌ర్ సినిమాకి కావ‌ల్సినంత విషయం ఉన్న క‌థే ఇది. కానీ ఆ క‌థ‌ని ప‌క‌డ్బందీగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడి అనుభ‌వం స‌రిపోలేదు. ప్రారంభ స‌న్నివేశాలు మామూలుగానే అనిపించినా... ఇంట్రవెల్ స‌మ‌యం నుంచి అస‌లు కథ మొద‌ల‌వుతుంది. ఊహించ‌ని కొన్ని ట్విస్ట్ లు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. కానీ ఆ ఇంట్రస్ట్ థ్రిల్‌ని పంచే స్థాయిలో మాత్రం లేదు. దాంతో సినిమా ఓ సాధార‌ణ పోలీసు సినిమాగా మారిపోయింది. దాంతో ఈ సినిమా స్క్రీన్ ప్లేలో మార్పులు చేసి తమిళంలో చేయబోతున్నట్లు సమాచారం.