భారీ ఎక్సపెక్టేషన్స్ నడుమ విడుదలైన ఆచార్య సినిమాకు సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఆ మూడ్ లో ఉన్న జనం మంచు విష్ణు ట్వీట్ కు ఆచార్య ఫెయిల్యూర్ కు ముడిపెట్టారు.
సోషల్ మీడియా జనం ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో చెప్పటం కష్టం..ఊహించటం అంతకన్నా కష్టం. అవతలి వాళ్ల మనస్సులో ఏ ఉద్దేశ్యం ఉన్నా తాము అనుకునే దానికి ముడిపెట్టేస్తూంటారు. అలాగే ఇప్పుడు మంచు విష్ణు తాజా ట్వీట్ కు ఆచార్య రిజల్ట్ కు ముడిపెట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే నాగబాబు ఇటీవల మోహన్ బాబు సినిమాను ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. తన అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది అని అడిగారు. దానికి నాగబాబు రెండూ కాదు ఓ లెజెండరీ గ్రాఫిక్స్ మూవీ.. అంటూ సమాధానం చెప్పారు. సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు వదులుతున్నారు.
తాజాగా మంచు విష్ణు ఓ ట్వీట్ చేసాడు. డాన్స్ రిహార్సల్స్ మొదలయ్యాయి. దీంతో ఒళ్ళంతా నొప్పులు అని..విష్ణు ఆ ట్వీట్ వెయ్యగానే అదిగో ఆచార్య సినిమా పోయింది అందుకే విష్ణు ఇలా సెటేరికల్ గా ట్వీట్ చేసాడు అంటూ ఆచార్య మూవీ రివ్యూస్, ఆ సినిమా కొచ్చిన రేటింగ్స్ కామెంట్స్ బాక్స్ లో పెట్టి మరీ మంచు విష్ణు ని ఆడేసుకుంటున్నాడు నెటిజెన్స్. భారీ ఎక్సపెక్టేషన్స్ నడుమ విడుదలైన ఆచార్య సినిమాకు సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఆ మూడ్ లో ఉన్న జనం మంచు విష్ణు ట్వీట్ కు ఆచార్య ఫెయిల్యూర్ కు ముడిపెట్టారు.
వాస్తవానికి మంచు విష్ణు మనస్సులో ఏముందో కానీ కావాలనే ఆ కామెంట్స్ చేశారంటూ నెటిజన్స్ విష్ణు ని ట్రోల్స్ చేస్తున్నారు. కావాలని ఆచార్య చిత్రాన్ని ట్రోల్ చేయడానికే మంచు విష్ణు ఈ ట్వీట్ చేసాడు అంటున్నారు. అయితే ప్రజెంట్ సిట్యువేషన్ అలాంటిది. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఏమి అన్నా...తమకు కావాల్సిన సిట్యువేషన్ ప్రకారం అర్దం తీసి ఆడుకుంటారు జనం. అందులో అయితే ఢోకా లేదు.
ఇక కొంత కాలంగా సినిమాల్లో సత్తా చాటలేకపోతున్న మంచు విష్ణు మా ఎలక్షన్స్ లో గెలిచారు. అయితే అదే సమయంలో మెగా ఫ్యామిలీతో విభేధాలు వచ్చాయి. ఆ తరవాత మెగా ఫ్యామిలీపై మంచు విష్ణు కామెంట్స్ చేసిన ప్రతీసారీ ట్రోల్ అవుతూనే ఉన్నాడు. అదే సమయంలో మంచు విష్ణు ఢీ సినిమాకి 15 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా ఓ ట్వీట్ వెయ్యగా.. నెటిజెన్స్ మంచు విష్ణు ని ఆడుకున్నారు. ఇక ప్రస్తుతం గాలి నాగేశ్వర రావు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో మంచు విష్ణు... సన్నీ లియోన్, పాయల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఆ సినిమా లొకేషన్స్ నుండి సన్నీ లియోన్ తో చేసిన ఫ్రాంక్ వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నాడు.
