విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం యాక్షన్. ప్రముఖ దర్శకుడు సుందర్ సి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదలయింది. పేరుకు తగ్గట్లుగానే ఈ చిత్రంలో దర్శకుడు యాక్షన్ ఎపిసోడ్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. విజువల్స్ కళ్ళు చెదిరేలా ఉన్నాయి. విశాల్ యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొడుతున్నాడు. ఎక్కువగా ఈ చిత్రాన్ని ఫారెన్ లొకేషన్స్ లో చిత్రీకరించారు. 

ఈ చిత్రంలో విశాల్ ఆర్మీ కల్నల్ సుభాష్ గా నటిస్తున్నాడు. ఇంటర్నేషనల్ క్రైం నేపథ్యంలో ఈ చిత్రం తెరక్కుతోంది. మిలటరీ ఆపరేషన్ లో భాగంగా విశాల్ ప్రత్యర్థులతో పోరాడే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. విశాల్ తో పాటు తమన్నా కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో మెరిసింది. 

కార్ ఛేజింగ్ లు, బైక్ ఛేజింగ్ సీన్స్ ని దర్శకుడు ఉత్కంఠ భరితంగా చిత్రీకరించినట్లు ఉన్నాడు. తమన్నా పవర్ ఫుల్ గా కనిపిస్తూనే గ్లామర్ ఒలకబోసింది. తమన్నాతో పాటు ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్ష పూరి కీలక పాత్రల్లో నటించారు. 

హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ట్రిడెంట్ ఆర్ట్స్ బ్యానర్ పై రవీంద్రన్ నిర్మిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్ తో యాక్షన్ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంది. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.