బాలీవుడ్ స్టార్ హీరో అనుష్క.. ఇండియన్ క్రికెటర్ విరాట్ కొహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా.. తమకంటూ కొంత సమయం వెచ్చించుకొని జీవితాన్ని సంతోషంగా ఆశ్వాదిస్తుంటారు.

ఇటీవల విరాట్ పుట్టినరోజు సందర్భంగా ఈ జంట భూటాన్ టూర్ ని వెళ్లారు. అక్కడే కొన్ని రోజులు సరదాగా గడిపారు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో  అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా విరాట్ ఓ ఆంగ్ల పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

హత్యాచార ఘటనపై దర్శకుడి కామెంట్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

ఇందులో భాగంగా అనుష్క శర్మ నటించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. ఆ సినిమాలో అనుష్క క్యారెక్టర్ అంటే తనకెంతో ఇష్టమని.. ఇప్పటికీ ఆ విషయాన్ని అనుష్కకి చెబుతుంటానని వెల్లడించారు.

సమయం దొరికినప్పుడు యూట్యూబ్ లో ఆ సినిమాని చూస్తుంటానని తెలిపారు. అనుష్కకి క్యాన్సర్ రావడం.. కొంతకాలం తర్వాత ఆమె తిరిగి రణబీర్ ని కలవడం.. ఆ సమయంలో వచ్చే ఓ పాట తనను ఎంతో బాధ పెడుతుందని.. తన హృదయాన్ని కరిగించేస్తుందని విరాట్ చెప్పుకొచ్చారు. అనుష్క శర్మ చివరిగా నటించిన చిత్రం 'జీరో'.షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. ప్రస్తుతం అనుష్క నిర్మాతగా ఓ వెబ్ సిరీస్ ని రూపొందిస్తుంది.