తాజాగా విరాట్ తన భార్య అనుష్క శర్మపై ఉన్న ప్రేమను మరోసారి తెలియజేశారు. ఇటీవల విరాట్ తన పుట్టినరోజు వేడుకలను అనుష్క శర్మతో కలిసి భూటాన్ లో జరుపుకున్నారు.

విరాట్ కొహ్లి, అనుష్క దంపతులు ఒకరు సినిమాలతో మరొకరు క్రికెట్ తో బిజీగా గడుపుతున్నారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ఎప్పటికప్పుడు తమ మీద ప్రేమను వ్యక్తపరుచుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంటారు. 

తాజాగా విరాట్ తన భార్య అనుష్క శర్మపై ఉన్న ప్రేమను మరోసారి తెలియజేశారు. ఇటీవల విరాట్ తన పుట్టినరోజు వేడుకలను అనుష్క శర్మతో కలిసి భూటాన్ లో జరుపుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ భూటాన్ లోని ఎన్నో ప్రాంతాలను సందర్శించారు.

దీనికి సంబంధించిన ఫోటోలను విరాట్, అనుష్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోలలో ఒక ఫోటోకి విరాట్.. 'అనుష్క శర్మ జీవితమనే ప్రయాణంలో కలిసి నడవడంలో ప్రేమ తప్ప మరేమీ ఉండదు' అని రాసుకొచ్చాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫొటోలకి లైకుల మీద లైకుల కొడుతూనే ఉన్నారు. 

View post on Instagram

View post on Instagram

View post on Instagram