బాలీవుడ్ నటుడు 'ఏ డెత్ ఇన్ ది గంజ్' ఫేమ్ విక్రాంత్ మాసే తన పెళ్లి విషయంలో వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. తన చిన్ననాటి స్నేహితురాలు షీతల్ ఠాకూర్ తో నిశ్చితార్ధం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే వీరిద్దరూ ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే.

ఓ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రాంత్ తన ప్రేమ, ఎంగేజ్మెంట్ వంటి విషయాల గురించి చెప్పుకొచ్చాడు. తన పెళ్లి ఎప్పుడనే విషయం మాత్రం చెప్పడానికి నిరాకరించారు. తన ప్రేయసితో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం నిజమేనని చెప్పిన విక్రాంత్.. నవంబర్ లో జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు మరియు కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారని.. దీని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని.. సరైన సమయంలో మాట్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

''ఇన్నర్స్ చించేసి.. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ..'' సినీ మహిళా ఆర్ట్ డైరెక్టర్ పై దాడి!

విక్రాంత్, షీతల్ బుల్లితెరపై ప్రసారమైన 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' అనే వెబ్ సిరీస్ సీజన్ 1లో కలిసి నటించారు.  అప్పటినుండి ఈ ఇద్దరూ తమకి సంబంధించిన విషయాలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమని తెలియజేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొన్‌ నటించిన 'చపాక్‌' సినిమాలో విక్రాంత్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.