విక్రమ్ తన కుమారుడు ధృవ్ ని వెండితెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ నటించిన తాజా చిత్రం ఆదిత్య వర్మ. తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తన తనయుడి తొలి చిత్రం కావడంతో విక్రమ్ టెన్షన్ ఫీల్ అవుతున్నాడట. 

విక్రమ్ ఆదిత్య వర్మ చిత్ర అవుట్ పుట్ గురించే ఆలోచిస్తుండడం వల్ల అతడి హార్ట్ బీట్ పెరిగిపోతున్నట్లు కోలీవుడ్ చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదిత్య వర్మ చిత్రాన్ని ముందుగా దీపావళికి విడుదల చేయాలని భావించారు. కానీ దీపావళి బరిలో పెద్ద చిత్రాలు ఉండడంతో నవంబర్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. 

త్వరలో ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. గిరిసాయి దర్శకత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ బాల తెరకెక్కించారు. కానీ దర్శకుడితో నిర్మాతలు విభేదించడం వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. షూటింగ్ మొత్తం పూర్తయ్యాక సినిమాని క్యాన్సిల్ చేశారు. 

తరువాత మళ్ళీ ఫ్రెష్ గా గిరిసాయి దర్శకత్వంలో తెరక్కించారు. విక్రమ్ కు బాల తెరకెక్కించిన చిత్ర అవుట్ పుట్ నచ్చకపోవడం వల్లే సినిమా ఆగిపోయిందని కోలీవుడ్ లో ప్రచారం జరిగింది.