లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా ఏళ్ల తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు. హీరోయిన్ గా గ్లామర్ పాత్రలతో పాటు, పవర్ ఫుల్ రోల్స్ లో కూడా విజయశాంతి నటించారు. చాలా కాలం తర్వాత విజయశాంతి మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. 

అనిల్ రావిపూడి దర్శత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. దీపావళి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి లుక్ రిలీజ్ చేస్తున్నారు. శనివారం అక్టోబర్ 26 ఉదయం 9:09 గంటలకు విజయశాంతి లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

విజయశాంతి పాత్రని చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచింది. ఆమె చాలా పవర్ ఫుల్ రోల్ లో నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించబోతున్నాడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.