టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్  రీ ఎంట్రీలు మాములుగా ఉండడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై అలనాటి నటీమణులు వారి నటనతో ఈ తరం ఆడియెన్స్ కి మరీంత దగ్గరవుతున్నారు. రీసెంట్ గా విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.  మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి నటించిన పాత్రకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

అయితే ఇప్పుడు విజయశాంతి మళ్ళీ తన నటనతో బిజీ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. నెక్స్ట్ ఆమె మెగాస్టార్ 152లో కూడా కనిపించనున్నట్లు టాక్ వచ్చింది. అయితే రీసెంట్ గా విజయశాంతి చేసిన ట్వీట్ ప్రకారం ఆమె ప్రస్తుతానికి ఎలాంటి సినిమాల్లో నటించడం లేదని ఒక క్లారిటీ అయితే వచ్చింది.

"సరిలేరు_మీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు"  

"ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం... మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు" అంటూ వివరణ ఇచ్చారు.