మొదట నుంచీ ప్రేమకథలకి పెట్టింది పేరు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ ప్రేమకథలు కాస్తంత ప్రత్యేకంగా.... బోల్డ్ గా ఉంటూ వస్తున్నాయి. ముఖ్యంగా `అర్జున్ రెడ్డి` నుంచి విజయ్ కంటూ యూత్ లో  ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఇమేజ్ ఏర్పడింది.  గీతా గోవిందం దాన్ని రెట్టింపు చేసింది. తన ఇమేజ్ కుస తగ్గట్టుగా కథల్ని ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలోనే  `వరల్డ్ ఫేమస్ లవర్` అంటూ ఈ శుక్రవారం వచ్చాడు. టైటిల్ ప్రకటించగానే అది విజయ్ మార్క్ అనిపించుకుని, అందరి దృష్టి ఆ సినిమాపై మళ్లింది.

దానికి తోడు ఇది నా చివరి ప్రేమకథ కావొచ్చంటూ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించారు విజయ్. అంతేకాకుండా సున్నితమైన చిత్రాల్ని తీసే క్రాంతిమాధవ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంకేముంది పెద్ద హిట్ కొట్టారు అనుకున్నారు. అయితే చిత్రంగా ఈ సినిమా మార్నింగ్ షోకే తేడా టాక్ వచ్చేసింది. సినిమా లో విషయం లేదని పెదవి విరిచేసారు. అయితే అందుకు కారణం ...విజయ్ ఇమేజ్ అని, అతని నుంచి ఎక్సపెక్ట్ చేసిన అంశాలేమీ సినిమాలో లేకపోవటం దెబ్బకొట్టిందని కొందరు అంటున్నారు. ఇదే కథ వేరే హీరో చేస్తే ఆడేదా...అంటే అసలు ఈ కథకు ముందే వేరే హీరోతోనే అనుకున్నారనే విషయం బయిటకు వచ్చింది.  ఆ హీరో మరెవరో కాదు నాని.

ఈ కథని క్రాంతి మాధవ్ ...మొదట న్యాచులర్ స్టార్ నాని కోసం రాసుకున్నారట. అయితే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన గ్యాంగ్ లీడర్ చిత్రం లో కూడా తన పాత్ర రైటరే అని, సున్నితంగా ఈ ఆఫర్ ని తిరస్కరించాడట నాని. అదే అతనికి కలిసొచ్చింది. దాంతో ఈ కథను పట్టుకుని విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చాడు దర్శకుడు. ఈ కథ రెగ్యులర్ లవ్ స్టోరీగా ఉండకపోవటం ,ఇందులో విజయ్ మూడు రకాల పాత్రల్లో కనిపించటం నచ్చి విజయ్ ఓకే చేసేసారు. కానీ కథను లోపలకి వెళ్లి చేస్తే దీంట్లో లోపాలు కనపడేవి. తనకు వర్కవుట్ కాదని తెలిసేది. ఆ విషయం సినిమా పూర్తయ్యాక గానీ విజయ్ కు అర్దం కాలేదట. ఫస్ట్ కాపీ చూసిన విజయ్ ...ఈ సినిమా తేడా కొడుతుందని అర్దం అయ్యి...ప్రమోషన్స్ కు దూరం జరిగాడు. ఆ విధంగా నాని తప్పించుకుంటే..విజయ్ ఈ ప్రాజెక్టుకు బలి అయ్యాడు.