తలపతి విజయ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘విజిల్’. ఈ చిత్రం కు రొటీన్ సినిమా, చెక్ దే ఇండియాకు పూర్ కాపీ అంటూ కామెంట్స్ వచ్చినా, కలెక్షన్స్ వైజ్ గా కత్తిలా దూసుకుపోతంది. ఫస్ట్ వీకెండ్ సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం విజిల్ మంచి వసూళ్లు రాబట్టడంతో తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందని లెక్కలు వేసారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే అనుకున్నది జరగలేదు.

ఫస్ట్ వీసెండ్  పూర్తైన తర్వాత విజిల్ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. తమిళంలోనూ అదే పరిస్దితి. అయితే అక్కడ విజయ్ కు ఉన్న క్రేజ్ కొంత వర్కవుట్ అవుతోంది.  అవన్నీ ప్రక్కన పెడితే శ్రీలంకలో ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తూ రికార్డ్ లు క్రియేట్ చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ మనకు ఏవైతే పెద్దగా ఎక్కలేదో ఆ సెకండాఫ్ ఎపిసోడ్స్ అక్కడ వారిని బాగా పట్టుకున్నాయి.

ఎమోషన్ తో పాటు బి, సి సెంటర్ల ప్రేక్షకులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉండటంతో సినిమా అక్కడ బాగా వసూళ్లు సాధిస్తోంది. థియోటర్స్ కూడా భారీగా పెంచినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో అక్కడ కొనుక్కున్న వాళ్ళంతా బ్రేక్ ఈవెన్ వచ్చి లాభాల్లో పడిపోయారు. ఇన్నాళ్లు ఏ తమిళ సినిమాకు రానీ రెస్పాన్స్ అక్కడ రావటం ట్రేడ్ ని షాక్ ఇచ్చేలా చేసింది. ఇక నుంచి తను రాబోయే సినిమాల్లోనూ శ్రీలంక జనాలకు నచ్చే ఎలిమెంట్స్ కలపాలని విజయ్ డెసిషన్ తీసుకున్నారు.

దాంతో శ్రీలంక వాళ్లకు ఈ సినిమాలో నచ్చిన విషయాలేంటి అనే దానిపై రీసెర్చ్ వర్క్ చేస్తున్నారట.  తెలుగు విషయానికి వస్తే...ఫస్ట్ వీకెండ్ ఆరున్నర కోట్లు వసూలు చేసిన విజిల్ తొలి వారం పూర్తయ్యేసరికి మరో రెండు కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ .10 కోట్లకు అమ్ముడయ్యాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోవడానికి ఇంకా రూ .2 కోట్లు దాకా సాధించాల్సి ఉంది. ఈ వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందంటున్నారు.

విజయ్ అట్లీ కాంబినేష‌న్‌లో విడుద‌లైన తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి.  ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో వచ్చిన ఈ చిత్రం హ్యాట్రిక్ చిత్రంగా విజిల్ నిలిచింది. న‌య‌న‌తార హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌ మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా బిగిల్ చిత్రం వసూళ్ల పరంగా సంతృప్తికరంగా ఉంది. దాదాపు 200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది బిగిల్. తమిళనాడులో అయితే ఈ చిత్రం పెద్ద హిట్.