ప్రస్తుతం తమిళ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో విజయ్ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. మొన్నటి వరకు తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా వెళ్లిన విజయ్ ఇప్పుడు రూటు మార్చేందుకు సిద్దమవుతున్నట్లు టాక్. ఆల్ మోస్ట్ తమిళ్ నాడులో రజినీకాంత్ మార్కెట్ పాతాళానికి పడిపోయింది. గతంలో మాదిరిగా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ అందుకోవడం లేదు.

అయితే గడచిన మూడేళ్ళలో విజయ్ నటించిన సినిమాలు ఈజిగా మూడు వందల కోట్లు దాటేశాయి. సౌత్ లో అత్యధిక మార్కెట్ ఉన్న నెంబర్ వన్ హీరోగా విజయ్ దూసుకుపోతున్నాడు. అయితే విజయ్ పై ఐటి దాడులు కావాలనే చేశారని కోలీవుడ్ లో గట్టిగానే టాక్ వస్తోంది. విజయ్ తన దగ్గర ఉన్న ఆర్థిక లావాదేవిలను కరెక్ట్ గానే చూపించినప్పటికీ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి విచారణ పేరుతో విజయ్ ని స్పెషల్ గా టార్గెట్ చేసినట్లు అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు.

బిగిల్ ప్రొడ్యూసర్స్ పై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐటి అధికారులు విజయ్ ని విచారిస్తున్నారు అని తెలియగానే వేల సంఖ్యలో అభిమానులు ఆయన షూటింగ్ లొకేషన్ కి వస్తున్నారు. విజయ్ ని టచ్ చేస్తే రాష్ట్రంలో ఊహించని పరిస్థితులు ఏర్పడుతాయని కథనాలు వెలువడుతున్నాయి. విజయ్ కి తమిళ్ యువత నుంచి భారీ మద్దతు లభిస్తోంది.  గతంలో విజయ్ పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు టాక్ వచ్చింది.

విజయ్ సైగ చేస్తే లక్షల మంది అభిమానులు వెంట వస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పడుకున్న సింహాన్ని గెలికినట్లు.. సైలెంట్ గా సినిమాలు చేసుకుంటున్న విజయ్ అనవసరంగా టచ్ చేశారని టాక్ వస్తోంది. తప్పకుండా తదుపరి ఎన్నికల్లో విజయ్ రాష్ట్రాన్ని కదిలించేలా అడుగులు వేయడానికి సిద్దమవుతున్నట్లు సమచారం. మరీ ఇది ఎంతవరకు నిజం అనేది విజయ్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు చెప్పలేము. కానీ రిటర్న్ గిఫ్ట్ మాత్రం తప్పకుండా ఉంటుందని సమాచారం.