ప్రస్తుతం కరోనా భయంతో ప్రపంచ దేశాలన్ని అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారి విజృంభనతో మనుషులు గడప దాటలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రముఖులు కరోనాతో పాటు సమాజంలోని సమస్యల విషయంలో ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. త్వరలోనే ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కూడా ఆగస్టు నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

అయితే ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ హీరో విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వలసు కూలీల కష్టాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. లాక్‌ డౌన్‌ కారణంగా అన్ని రంగాలు మూత పడటంతో లక్షలాది మంది ఉపాది కోల్పోయారు. దీంతో వారంత తమ సొంత గ్రామాల వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్క పూట కూడా తిండి దొరకని పరిస్థితుల్లో చాలా మంది అల్లాడుతున్నారు. వారి కష్టాలను చూసి చెలించిన పోయిన కొంత మంది స్వచ్చందంగా సేవా చేస్తున్నా అందరికీ అందే స్థాయిలో మాత్రం జరగటం లేదు.

ఈ కష్టాలను దృష్టిలో పెట్టుకొని విజయ్‌ సేతుపతి ఆసక్తికర ట్వీట్ చేశాడు. `దేవుగా ఆకలి అనే జబ్బు కూడా చాలా కాలంగా ఉంది. దానికి కూడా వ్యాక్సిన్‌ కనిపెడితే బాగుంటుంది` అంటూ ట్వీట్ చేశాడు. విజయ్‌ సేతుపతి తమిళ భాషలో చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్‌ సేతుపతి ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో మెగా వారసుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాలో   నటిస్తున్నాడు. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలోనూ విజయ్‌ నటించాల్సి ఉంది. అయితే డేట్స్ అడ్జెస్ట్ కావన్న ఉద్దేశంతో విజయ్‌ ఆ సినిమాను నుంచి తప్పుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది.