తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘బిగిల్’. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మొన్న శుక్రవారం  రిలీజ్ చేసారు. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గణేశ్‌, కల్పాతి ఎస్‌.సురేశ్‌ నిర్మించారు.

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘బిగిల్’. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మొన్న శుక్రవారం రిలీజ్ చేసారు. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గణేశ్‌, కల్పాతి ఎస్‌.సురేశ్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'విజిల్‌' పేరుతో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు అందించారు.

తెలుగులో విజయ్ సినిమా ఈ స్దాయిలో భారీ ఎత్తున విడుదల అవడం ఇదే తొలిసారి. ‘అదిరింది’ ‘సర్కార్’ వంటి చిత్రాలు హిట్ అవ్వడంతో ‘విజిల్’ పై కూడా ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రానికి తెలుగులో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఈ రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...తెలుగు రాష్ట్రాల్లో ‘విజిల్’ రెండు రోజుల కలెక్షన్స్ బాగున్నాయి. రెండు రోజుల షేర్ 4.39 కోట్లు వచ్చింది. ఆ వివరాలు ఏరియా వైజ్ చూద్దాం :

ఏరియా షేర్ (లక్షల్లో)

-------------------- ----------------------------------------

నైజాం 131.00

సీడెడ్ 106.00

నెల్లూరు 18.00

కృష్ణా 25.45

గుంటూరు 68.00

వైజాగ్ 45.07

ఈస్ట్ గోదావరి 25.00

వెస్ట్ గోదావరి 20.44

మొత్తం ఆంధ్రా & తెలంగాణా షేర్ 438.96

ఈ చిత్రాన్ని లేడీస్‌ ఫుట్‌బాల్‌ క్రీడను ఆధారంగా చేసుకుని డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించగా రాజప్ప అనే మాస్‌ క్యారెక్టర్‌తో పాటు.. యంగ్‌ లుక్‌లోని మైకేల్‌ అనే ఫుట్‌బాల్‌ కోచ్‌ పాత్రలో విజయ్ నటన ఆకట్టుకుంటోంది. నయనతార గ్లామర్‌ సినిమాకు ఓ ప్లస్‌ అయ్యింది. లేడీస్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ను మైకేల్‌ ఎలా ట్రైన్‌ చేశాడు. అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.