విజయ్ నటించిన బిగిల్ చిత్రం దీపావళి కానుకగా విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తెలుగులో బిగిల్ చిత్రాన్ని 'విజిల్' పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో విజయ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా విడుదలైన ట్రైలర్ ని పరిశీలిస్తే ఫుట్ బాల్ కోచ్ గా, మిడిల్ ఏజ్డ్ వ్యక్తిగా విజయ్ మాస్ లుక్ లో అదరగొట్టేశాడు. ఈ చిత్రం కథ ఫుట్ బాల్ క్రీడ చుట్టూ తిరగనుంది. ఏఆర్ రెహమాన్ ఎప్పటిలాగే తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ ని మరోస్థాయికి చేర్చాడు. 

ట్రైలర్ లో విజువల్స్ అదిరిపోయాయి. యాక్షన్, ఎమోషనల్, లవ్ సీన్లు సమపాళ్లలో ఉన్నాయి. ఫుట్ బాల్ ఆట మాకు తెలియదు.. మా ఆట దడ పుట్టిస్తుంది అంతో విజయ్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. 

ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు 'విజిల్' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. బిగిల్ చిత్రాన్ని ఏజియస్ ప్రొడక్షన్ బ్యానర్ లో అర్చన కల్పత్తి నిర్మించారు. నయనతార విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆసక్తి రేపుతున్న విజిల్ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.