రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేసిన ప్రొడక్షన్ మీకు మాత్రమే చెప్తా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.  తన శాయశక్తులా ఈ సినిమాకు ప్రమోషన్స్ చేసినా పూర్ గా ఉన్న ప్రొడక్షన్, కంటెంట్ సరిగ్గా లేకపోవటం సినిమాకు బాగా దెబ్బకొట్టాయి. అయితే విజయ్ దేవరకొండ కు ఉన్న ఇమేజ్ తో మంచి రేటుకు బిజినెస్ చెయ్యటంతో.. రిలీజ్ కు ముందే ఈ సినిమాకు లాభాలు వచ్చాయని వినికిడి. అలాగే డిజిటిల్ రైట్స్ నిమిత్తం, శాటిలైట్ రైట్స్ తో కలిపి బాగా వర్కవుట్ చేసారు విజయ్.

ఆ ఉత్సాహం..ఆ పెట్టుబడితో ఇప్పుడు మరో సినిమా ప్రొడక్షన్ చేయబోతున్నట్లు వినికిడి. ఈ సినిమా ద్వారా ఎవరైనా నష్టపోయి ఉంటే కనుక వారికి తను నిర్మించబోయే నెక్ట్స్ సినిమాలో చూసుకుందామని హామీ ఇచ్చారట. దాంతో ఎక్కువ రేటు పెట్టి కొన్న ఎగ్జిబిటిర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కాస్త రిలీఫ్ అయ్యారు.  ఈ క్రమంలో విజయ్ దేవరకొండ నెక్ట్స్ చిత్రానికి ఓ దర్శకుడుని ఆల్రెడీ ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. మీకు మాత్రమే చెప్తా సినిమా షూటింగ్ సమయంలోనే ఓ రెండు స్క్రిప్టులు ఓకే చేసి ...ఈ సినిమా రిలీజ్ తర్వాత చేద్దామని చెప్పినట్లు సమాచారం.

ఇక రాబోయే రెండు సినిమాల్లో ఒక దాంట్లో తన సోదరుడు హీరోగా ఉంటాడని చెప్పారట. మరో సినిమాలో తనతో పాటు జర్ని మొదలుపెట్టి తనతో ప్రయాణం చేస్తున్నవారిని తీసుకునే అవకాసం ఉంది. అయితే నెక్ట్స్ ప్రాజెక్టు స్క్రిప్టు విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట. అందుకోసం స్క్రిప్టు ని రీరైట్ చేయమని చెప్పారట. మొత్తానికి విజయ్ దేవరకొండ వరస సినిమాలు చేసేందుకు ముందుకు రావటం చాలా మంది ఆయన టీమ్ లో వారికి ఆనందం కలిగిస్తోంది. భవిష్యత్తులో తమకూ ఆయన ద్వారా లాంచ్ అవుతామని భావిస్తున్నారు.