Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగస్టర్ గా విజయ్ దేవరకొండ? దసరాకు ఎనౌన్సమెంట్?

ఇటీవల 'ఖుషి' సినిమాతో పలకరించిన విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమా కమిటైనట్లు సమాచారం.  ఈసారి గ్యాంగస్టర్ కథతో మన ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.  

Vijay Deverakonda signs a gangster film under Dil Raju productions jsp
Author
First Published Sep 26, 2023, 7:17 AM IST


లైగర్ డిజాస్టర్ నుంచి బయిటపడి రీసెంట్ గా ఖుషీ చిత్రం చేసారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నైజాం, యుఎస్ వంటి ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ వచ్చింది. ఈ ఉత్సాహంలో  విజయ్ దేవరకొండ గ్యాంగస్టర్ గా కనిపించానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. అదీ భారీగా రూపొందే ఓ చిత్రంలో అని తెలుస్తోంది. ఎవరా నిర్మాత అంటే దిల్ రాజు అంటున్నారు. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ పోస్టర్ తో దసరా కు రాబోతోందని చెప్తున్నారు. అయితే ఎవరా డైరక్టర్...అంటే...

దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో కొత్త సినిమా రాబోతుంది. కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమైన రాజావారు, రాణీగారు సినిమా దర్శకుడితో ఈ సినిమా ఉండనుంది. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. రాజావారు రాణీగారు సినిమాతో ప్రేక్షకులను అలరించిన రవి కిరణ్ కోలా దర్శకుడితో తమ నెక్స్ట్ సినిమా ఉండబోతుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాలో హీరో ఎవరనేది ఇంకా వెల్లడి చేయలేదు. ఏ జోనర్ లో సినిమా రూపొందుతుందనేది కూడా తెలియజేయలేదు. కానీ ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ అని సమాచారం.  రాజావారు రాణీగారు వంటి ప్రేమ కథా చిత్రంతో ఆకట్టుకున్న రవి కిరణ్ కోలా, ఈసారి గ్యాంగస్టర్ కథతో మన ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకూ నిజముంది అనేది అఫీషియల్ ప్రకటన వస్తేనే కానీ తెలిసే అవకాసం లేదు. 

రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)హీరోగా   13వ సినిమా (VD13 Movie)  ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను హీరోయిన్ గా చేస్తోంది.  'సీతా రామం'లో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను  ఫిదా చేసింది. విజయ్ దేవరకొండ, 'దిల్' రాజు సినిమాకు తొలుత దర్శకుడిగా చాలా మంది పేర్లు వినిపించాయి. మోహన కృష్ణ ఇంద్రగంటి నుంచి గౌతమ్ తిన్ననూరి వరకు కొందరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరకు, పరశురామ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు. 14 రీల్స్, గీతా ఆర్ట్స్ సంస్థలో చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టి మరీ పరశురామ్ ఈ సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.

Follow Us:
Download App:
  • android
  • ios