హీరోలందరి దృష్టీ ఇప్పుడు ప్యాన్ ఇండియా కాన్సెప్టు పై పడింది. బాహుబలి తర్వాత అందరూ దేశం మొత్తం తమ సినిమా రిలిజ్ అయ్యేలా ప్లాన్  చేయాలనే ఆలోచనలో ఉంటున్నారు. తెలుగు నుంచి రీసెంట్ గా సైరా, సాహో చిత్రాలు ప్యాన్ ఇండియా రిలీజ్ లు అయ్యాయి. అయితే రెండు సినిమాలు అన్ని చోట్లా వర్కవుట్ కాలేదు. కొన్ని ప్రాంతాల్లోనే సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అదే రూట్ లో ప్రయాణం పెట్టుకోదలిచాడు.

సెన్సేషనల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కు “అర్జున్ రెడ్డి” సినిమాతో తెలుగుతోపాటు అన్ని భాష‌ల్లోనూ క్రేజ్ ను వచ్చింది. ఆయన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్” ని  ఇటీవలే నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదల చేసాడు. అయితే సినిమాలో అంతకు తగ్గ కంటెంట్ లేకపోవటంతో నిలబడలేదు. దాంతో ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీ గా తన తదుపరి చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో  చేస్తున్న సినిమాతో విజయ్ ఈ ప్రయత్నం చేయబోతున్నారు.

అందుతున్న సమాచారం మేరకు ‘ఇస్మార్ట్ శంకర్‌’తో సూపర్ హిట్ అందుకున్న పూరీ ఓ సూపర్ క్రేజీ పాత్రను విజయ్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ ఖచ్చితంగా పెద్ద హిట్ కొ డతాననే నమ్మకంతో  ఉన్నారని టాక్. పదాలు సరిగా పలకలేని వ్యక్తి, జీవితంలో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు. తనకు ఎదురయ్యే సమస్యలపై ఫైటర్ గా నిలిచి ఎలా గెలుపు సాధిస్తాడు అనే పాత్రలో నటించనున్నాడని టాక్.  

ఈ నేపధ్యంలో  “ఫైటర్” సినిమా తెలుగులోనే కాకుండా పలు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతోందని తెలుస్తోంది. పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలవుతుందని సమాచారం. “అర్జున్‌రెడ్డి” సినిమాతో ఏర్పడ్డ క్రేజ్ తో విజయ్‌ బాలీవుడ్ లో  జరిగే వేడుకలకు, పార్టీలకు విజయ్ హాజరవుతున్నాడు. అక్కడి స్టార్లతో అనుబంధం ఏర్పరుచుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో లాంచ్ అవుతూ  ఓ సినిమా చేయాలని విజయ్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. ఇప్పుడు “ఫైటర్” కోసం పూరీ ఆ తరహా కథనే సిద్ధం చేయడంతో ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే మంచిదని విజయ్ భావిస్తున్నాడట.