'వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్': నిర్మాతకి విజయ్ దేవరకొండ ట్విస్ట్, ముంబైకి జంప్?

అర్జున్ రెడ్డిలో సీన్స్ ని గుర్తు చేస్తోందని ఫ్యాన్స్ వాపోయారు. అయితే ఎంతో షార్ప్ గా ఉండే విజయ్ దేవరకొండ ఈ ఫలితం ముందే ఊహించలేకపోయారా...అంటే గెస్ చేసారనే చెప్పాలి. 

Vijay Deverakonda rejects KS Rama Rao's request for Promotion

విజయదేవరకొండ కెరీర్ లో  `పెళ్ళిచూపులు`, `అర్జున్‌రెడ్డి`, `గీత గోవిందం` సినిమా సూప‌ర్‌ సక్సెస్‌ల‌ు అయ్యాయి. మిగిలిన చిత్రాలేవీ చెప్పుకోదగ్గ ఆద‌ర‌ణ పొంద‌క‌పోయినా విజ‌య్‌కి యూత్‌లో క్రేజ్ త‌గ్గలేదు.  పబ్లిక్ గా తన మనస్సులో ఉన్నదున్నట్లు  ఓపెన్‌గా మాట్లాడ‌టం, యూత్ కు దగ్గరయ్యే స్టైల్స్ మెయింటైన్ చేయటంతో అతనికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులకు లోటు లేదు. దాంతో నిర్మాతలు ..ఈ హీరో చుట్టూ ప్రదక్షణాలు చేస్తూంటారు. ఇక తన వయస్సుకు తగినట్లు ఎక్కువ ప్రేమ‌క‌థా చిత్రాల్లోనే కనిపించిన విజయ్ ...వాటిల్లో  కాస్త డిఫ‌రెంట్ గా కనిపించటానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు.

అలాంటి ఈ యంగ్ హీరో ఇదే త‌న చివ‌ర ప్రేమ‌క‌థా చిత్ర‌మంటూ ప్రేమికుల‌రోజైన ఫిబ్ర‌వ‌రి 14న `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే సినిమా అనుకున్న స్దాయిలో లేదని మార్నింగ్ షోకే రిజల్ట్ వచ్చేసింది. దర్శకుడు తన తెలివితేటలు అన్నీ వాడి సినిమాని చెడకొట్టాడనే విమర్శలు వచ్చాయి.

'వరల్డ్ ఫేమస్ లవర్' ట్విట్టర్ రివ్యూ!

అర్జున్ రెడ్డిలో సీన్స్ ని గుర్తు చేస్తోందని ఫ్యాన్స్ వాపోయారు. అయితే ఎంతో షార్ప్ గా ఉండే విజయ్ దేవరకొండ ఈ ఫలితం ముందే ఊహించలేకపోయారా...అంటే గెస్ చేసారనే చెప్పాలి. సాధారణంగా తమ సినిమాల రిలీజ్ లు ముందు..రిలీజ్ తర్వాత కొంత టైమ్ తీసుకుంటారు. ఏ పనులు పెట్టుకోరు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ముంబై సిటీకి షూటింగ్ కు వెళ్లిపోయారు. పూరి జగన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ కోసం వెళ్లినట్లు సమాచారం.

అప్పటికీ నిర్మాత చాలా రిక్వెస్ట్ చేసారని, ప్రమోషన్ కు రమ్మనమని అడిగినా ...కాదని చెప్పేసారని సమాచారం. సినిమా ఫస్ట్ కాపీ చూసి రిజల్ట్ ముందే ఊహించిన విజయ్ దేవరకొండ...అక్కడ నుంచి సైలెట్ అయ్యిపోయాడని అంటున్నారు. అందుకే ప్రమోషన్స్ లో చివరి నాలుగు రోజుల్లో తప్ప కనపడలేదని చెప్తున్నారు. 

సినిమా రిలీజ్ అయ్యాక అసలు తన సినిమా కాదన్నట్లు వ్యవహిరిస్తున్నాడని అంటున్నారు. తనకు ఈ సినిమాని ప్రమోట్ చేసే మూడ్ లేదని రిలీజ్ కు ముందే స్ట్రాంగ్ గా చెప్పాడని, దాని నిమిత్తం ఆర్గ్యుమెంట్ కూడా జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే వ్యూహాత్మకంగా సినిమా ప్రమషన్స్ కు డుమ్మా కొట్టడం కోసమే ముంబై వెళ్లాడంటున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios