Asianet News TeluguAsianet News Telugu

#Liger:‘లైగర్‌’టీమ్ ఏదీ వదలటం లేదుగా,ఇప్పుడు ఇది కూడా...

ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలోనూ లైగర్ హడావిడి కనిపిస్తోంది. రోజూ ఈ సినిమాకు సంబంధించిన ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. 

Vijay Deverakonda Liger gets its own Twitter emoji
Author
Mumbai, First Published Aug 19, 2022, 8:25 AM IST


విజయ్‌ దేవరకొండ   హీరోగా రూపొందిన పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైగర్‌’. ఈ సినిమా ఆగస్టు 25న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనన్యా పాండే  హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ కూడా పూర్తైంది. మొత్తం 140.20 నిమిషాల రన్‌ టైమ్‌తో సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాకి బోర్డు ఏడు మార్పులు చేర్పులు సూచించింది.  కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రమోషన్స్ ఓ రేంజిలో చేస్తున్నారు. 

దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నారు లైగర్(Liger)టీమ్..  ఇప్పటికే అనేక నగరాల్లో లైగర్ టీమ్ పర్యటించారు. ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలోనూ లైగర్ హడావిడి కనిపిస్తోంది. రోజూ ఈ సినిమాకు సంబంధించిన ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా లైగర్ సినిమా ఎమోజీని సాధించింది. 

ట్విటర్‌ ఎమోజీని పొందిన మూడో సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ప్రభాస్ సాహూ సినిమా తర్వాత కేజీఎఫ్ 2 , మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలు ఎమోజీని దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు లైగర్ సినిమాకు ట్విట్టర్ ఎమోజీని క్రియేట్ చేసింది దాంతో లైగర్ టీమ్ ట్విట్టర్ కు థాంక్స్ చెప్పారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడులవుతుండటంతో సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లకు మరింత చేరువ అయ్యే క్రమంలో చిత్ర బృందం ట్విటర్‌కు దరఖాస్తు చేయగా, #Liger హ్యాష్‌టాగ్‌ జత చేయగానే విజయ్‌ దేవరకొండ ఫొటోతో కూడిన ఎమోజీ వస్తుంది. 

 ఇక ఈ మూవీ ఆగస్ట్ 20న సాయంత్రం 5 గంటలకు గుంటూరు జిల్లా మోతడక ప్రాంతంలోని చలపతి ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్‏లో లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను నిర్వహించనున్నట్లుగా ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు మేకర్స్. 

Follow Us:
Download App:
  • android
  • ios