హైదరాబాద్ టైమ్స్  ఎప్పటిలానే ఈ ఏడాది కూడా  “మోస్ట్ డిసైరబుల్ మెన్” లిస్ట్ ని విడుదల చేసింది.  అయితే ఈ సారి కూడా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎవరు ఊహించని విధంగా సూపర్ స్టార్ ని సైతం ,వెనక్కి నెట్టేసి యూత్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిస్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది కూడా ఈ పోటీలో విజయ్ మొదటి స్థానంలో నిలిచాడు.

మహేష్ , చరణ్ , ప్రభాస్,  అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఇలాంటి కాంపిటీషన్ లో నిత్యం పోటీ పడుతుంటారు. అయితే విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ హిట్స్ తో పాటు జనాలను కట్టుకునే విధంగా నడుచుకోవడంలో బలశాలి. ఈ విధంగా రెండు సార్లు గుర్తింపు అందుకున్న మొట్టమొదటి సౌత్ హీరో విజయ్ కావడం విశేషం.రామ్ చరణ్ (2), రామ్ (3), ప్రభాస్ (4), సల్మాన్ జైదీ (5) వంటి ఇతర ప్రముఖ తారలు ఆ తరువాత స్థానాలను అందుకున్నారు.

ఫైనల్ గా రెండవసారి కూడా మోస్ట్ డిసైరబుల్ ఫర్ ఎవర్ అనే కీర్తిని అందుకున్నాడు. రీసెంట్ గా వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ నెక్స్ట్ ఫైటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.