టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి పది కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. చాలా మంది హీరోయిన్లు కూడా విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని భావిస్తున్నాడు.

జాన్వీ కపూర్, అలియా భట్, కియారా అద్వానీ లాంటి వాళ్లు కూడా విజయ్ దేవరకొండ స్టైల్ ని మెచ్చుకుంటూ ఉంటారు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ప్యాన్ ఇండియా గుర్తింపు సంపాదించిన ఈ హీరో బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్.

టైమ్ దొరికితే చాలు..ఈ స్టార్లు.. అక్కడ వాలిపోతారు!

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ దేవరొండ హీరోగా మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండకి ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ వింటే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఇంతకీ ఆ మొత్తం ఎంతో తెలుసా..? అక్షరాల రూ.48 కోట్లు. ఒక్క సినిమా కోసం విజయ్ కి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

ఇలాంటి ఆఫర్ ని రిజెక్ట్ చేయడం విజయ్ వల్ల కాదు కాబట్టి అంత రెమ్యునరేషన్ ఇస్తే కచ్చితంగా సినిమా ఒప్పుకుంటాడు. పైగా కరణ్ జోహార్ బ్యాక్ బోన్. సినిమా గనుక హిట్ అయితే విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో కూడా చక్రం తిప్పడం ఖాయం.

ప్రస్తుతం విజయ్ 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేయబోతున్నారు