టాలీవుడ్  రౌడీ బాయ్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ.గత ఏడాది డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు.ఇక ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

శుక్రవారం ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు అనుకున్నంతగా బజ్ అయితే క్రియేట్ కావడం లేదు. సినిమా రిజల్ట్ పై క్లారిటీ రావాలంటే సినిమాకి హిట్ టాక్ తప్పనిసరి అవసరం.అయితే విజయ్ కెరీర్ లో ఎక్కువగా -ప్రేమ కథలే హిట్ అయ్యాయి. మధ్యలో టాక్సీ వాలా సక్సెస్ అయినప్పటికీ గీత గోవిందం రేంజ్ లో క్లిక్కవ్వలేదు.  ద్వారక - నోటా - డియర్ కామ్రేడ్ లో లవ్ కాన్సెప్ట్ ఎంత ఉన్నా కూడా ప్రయోగాత్మక సినిమాలే అని చెప్పాలి.

పొలిటికల్ అంశాలు కూడా ఉన్నాయి. అయితే సినిమాలు మాత్రం పెద్దగా ఆడలేదు. ఇక ఇప్పుడు ఏకంగా ఒక్క సినిమాలోనే నాలుగు ప్రేమ కథలను చూపించడానికి ట్రై చేస్తున్నాడు. ట్రైలర్ అయితే క్లిక్కయ్యింది. ఇక సినిమా మొదటి షోకి పాజిటివ్ టాక్ అందుకుంటే తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవుతుంది. మరి విజయ్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.