టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాల తరువాత ఇలాంటి హీరోతో ఎలాగైనా ఒక సినిమా చేయాలనీ స్టార్ దర్శకులు కూడా అనుకున్నారు అంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో చెప్పనవసరం లేదు.

అయితే ఇప్పుడు మాత్రం అంత రివర్స్ అయ్యింది, విజయ్ బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు, వరల్డ్ ఫెమస్ లవర్ మాములు దెబ్బ కొట్టలేదు. డియర్ కామ్రేడ్ సినిమా తరువాత మంచి సక్సెస్ అందుకోవాలని చూసిన విజయ్ కి ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఏ మాత్రం కిక్కివ్వలేకపోయింది. 30కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన 'వరల్డ్ ఫెమస్ లవర్' కేవలం 10కోట్ల షేర్స్ మాత్రమే రాబట్టగలిగింది.  విజయ్ మీద నమ్మకంతో నలుగురి హీరోయిన్స్ ని తీసుకొని మంచి బడ్జెట్ తోనే సినిమాను నిర్మించారు.

కానీ సినిమా బయ్యర్స్ కి నష్టాలను మిగిల్చింది. డియర్ కామ్రేడ్ అనుకున్నంతగా పాజిటివ్ టాక్ ను అందుకోకపోయినప్పటికీ పెద్దగా నష్టాల భారిన పడకుండా చేసింది. కానీ వరల్డ్ ఫెమస్ లవర్ మాత్రం ఓపెనింగ్స్ ని కూడా స్ట్రాంగ్ గా అందుకోలేకపోయింది. ఇక గతంలో మాదిరిగా విజయ్ సినిమాల ప్రమోషన్స్ కి కూడా బజ్ ఎక్కువగా క్రియేట్ చేయలేకపోయాడు. ఫైనల్ గా ఈ సినిమా విజయ్ ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. 20కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. మరీ నెక్స్ట్ ఫైటర్ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.