టాలీవుడ్ లో ప్రస్తుతం గ్యాప్ లేకుండా షూటింగ్ లలో పాల్గొంటున్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. విజయ్ ఎంత బిజీగా ఉన్నాడంటే ఇప్పట్లో మరో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు. ఎంత పెద్ద డైరెక్టర్ నుంచి అఫర్ వచ్చినా వచ్చే ఏడాది ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

 

ప్రస్తుతం రౌడీ స్టార్ మీకు మాత్రమే చెప్తా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  విజయ్ సొంతంగా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక ఆ సినిమా అనంతరం విజయ్ ఫుల్ బిజీగా షెడ్యూల్స్ లలో పాల్గొననున్నాడు. వరుసగా నాలుగు సినిమాల షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నాడు. గతంలో ఎప్ప్పుడు లేని విధంగా విజయ్ ఈ రెండేళ్లు బిజీ కానున్నాడు. మొదట వరల్డ్ ఫెమస్ లవర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.  

ఆ సినిమా దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది.  క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది లవర్స్ డేకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అనంతరం హీరో అనే మరో సినిమాను విజయ్ రిలీజ్ చేయనున్నాడు. తమిళ్ డైరెక్టర్ ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను మైత్రి మేకర్స్ నిర్మిస్తోంది. అలాగే శివ నిర్వాణ డైరెక్షన్ లో కూడా విజయ్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చేయనున్నాడు.

నిన్ను కోరి - మజిలీ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ మొదటిసారి విజయ్ దేవరకొండను డైరెక్ట్ చేస్తుండడంతో ఆడియెన్స్లో  స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. వీటన్నిటితో పాటు విజయ్ డిసెంబర్ లోనే పూరి జగన్నాథ్ తో ఫైటర్ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మరి ఈ  ప్రాజెక్టులతో రౌడీ స్టార్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.