టాలీవుడ్ లో ఫెస్టివల్స్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేసుకోవడం మొదలయ్యింది. రానున్న క్రిస్మస్ అలాగే సంక్రాంతి పండగలకు కూడా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు గట్టిగా హడావుడి చేయనున్నాయి. దీపావళిని తమిళ సినిమాలకు వదిలేసిన టాలీవుడ్ నెక్స్ట్ ఫెస్టివల్స్ ని మాత్రం మిస్ చేసుకోకూడదని టార్గెట్ గా పెట్టుకున్నారు.

మాస్ రాజా రవితేజతో పాటు కుర్ర హీరోలు సాయి ధరమ్ తేజ్ - విజయ్ దేవరకొండ కూడా ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగుతున్నారు.  రవితేజ డిస్కో రాజా సినిమా క్రిస్మస్ కి రానుంది. ఇక అదే తరహాలో డిసెంబర్ 20కి మెగా హీరో సాయి తేజ్ 'ప్రతి రోజు పండగే' సినిమాను రిలీజ్ చేయనున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ త నెక్స్ట్ సినిమా 'వరల్డ్ ఫెమస్ లవర్' ని అదే సమయంలో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయినట్లు సమాచారం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ముగ్గురు హీరోలు ఒకే రిలీజ్ సమయంలో పోటీకి సిద్ధమవుతున్నారు.  

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వరల్డ్ ఫెమస్ లవర్ పై ఓ వర్గం ఆడియెన్స్ లో పాజిటివ్ టాక్ మొదలైంది. ఇక ఇప్పటికే డిస్కోరాజా - ప్రతిరోజు పండగే సినిమాల ప్రమోషన్స్ మొదలయ్యాయి. కానీ విజయ్ మాత్రం ఫస్ట్ లుక్ తప్పితే ఎలాంటి హడావుడి మొదలుపెట్టలేదు. మరో అర్జున్ రెడ్డి లా ఎదో కొత్త ప్రయోగం చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ తో అయితే క్లారిటీ ఇచ్చేశాడు. ఇక డిస్కో రాజా కూడా సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండడంతో ఆ సినిమాపై కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి.