'వరల్డ్ ఫేమస్ లవర్' ఫస్ట్ డే కలెక్షన్స్!
క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1150 స్క్రీన్స్ లో విడుదలైన ఈ సినిమా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో రూ.4.28 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఏరియాల వారీగా సినిమా కలెక్షన్లు..
నైజాం.........................................రూ.2.01 కోట్లు
సీడెడ్...........................................రూ.0.39 కోట్లు
ఉత్తరాంధ్ర.................................రూ.0.52 కోట్లు
గుంటూరు....................................రూ.0.43 కోట్లు
ఈస్ట్.................................................రూ.0.30 కోట్లు
వెస్ట్...................................................రూ.0.20 కోట్లు
కృష్ణ..................................................రూ.0.25 కోట్లు
నెల్లూరు..........................................రూ.0.18 కోట్లు
మొత్తం ఏపీ, తెలంగాణాల్లో కలిపి ఈ సినిమా రూ.4.28 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు ఈ సినిమా రూ.6 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.23.81 కోట్లకు అమ్ముడయ్యాయి.