అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస ప్రమోషన్స్ తో సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇతర స్టార్ హీరోల నుంచి కూడా బన్నీకి బెస్ట్ విషెస్ అందుతున్నాయి. ఇక అందరికంటే ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ బన్నీకి  మంచి గిఫ్ట్ ఇచ్చాడు.

అసలు అసలు మ్యాటర్ లోకి వస్తే రౌడీ అనే పేరుతో క్లాత్ బిజినెస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అల వైకుంఠపురములో విడుదల సందర్బంగా బన్నీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో రౌడీ బ్రాండ్ దుస్తులతో దర్శనమివ్వాలని కొన్ని డ్రెస్సులు పంపించాడు. అందుకు స్టయిలిష్ స్టార్ ఆనందపడుతూ విజయ్ ఇచ్చిన డ్రెస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తప్పకుండా ఈ డ్రెస్సులతో 'అల వైకుంఠపురములో ' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటానని బన్నీ వివరణ ఇచ్చాడు.

ఇక విజయ్ దేవరకొండ.. బన్నీ అన్న సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని స్టైలిష్ స్టార్ రౌడీ స్టార్ అవుతున్నట్లు చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో ఇరు వర్గాల అభిమానులను ఎట్రాక్ట్ చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా నేడు వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ కూడా అల్లు అర్జున్ అదే స్థాయిలో రంగంలోకి దిగబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఆదివారం రిలీజ్ కాబోతోంది.