రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ చివరగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఆ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీనితో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాలపై ప్రత్యేక ద్రుష్టి పెడుతున్నాడు. 

విజయ్ దేవరకొండ లోని విభిన్నమైన యాటిట్యూడ్ కు యువత ఆకర్షితులయ్యారు. యూత్ ని ఆకట్టుకునే చిత్రాలే ప్రస్తుతం విజయ్ చేస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఫస్ట్ లుక్ తోనే సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తుండడం మరో విశేషం. 

తాజాగా చిత్ర యూనిట్ ఒక్కో హీరోయిన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తోంది. నలుగురు హీరోయిన్లలో ఇప్పటి వరకు ఐశ్వర్య రాజేష్, ఫారెన్ ముద్దుగుమ్మ ఇజా బెల్ల ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేశారు. ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో సువర్ణ అనే పాత్రలో ఇల్లాలిగా నటిస్తోంది. 

నేడు ఇజా బెల్ల లుక్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఇజా బెల్ల పాత్ర పేరు ఇజ. తన ఫస్ట్ లుక్ ని రివీల్ చేస్తూ ఇజా బెల్ల ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ చిత్ర టీజర్ ని జనవరి 3న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. 

ఈ చిత్రాన్ని వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది.