సెన్సేషనల్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. విభిన్న చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడు.

విజయ్‌కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.  

''ఈ ప్రపంచంలోనే స్వార్ధమైనది ఏమైనా ఉందంటే.. అది ప్రేమ ఒక్కటే.. ఆ ప్రేమలో కూడా నేనూ అనే రెండు అక్షరాలు ఓ సునామీనే రేపగలవు.. ఐ వాంటెడ్ టు బి దిస్ వరల్డ్ ఫేమస్ లవర్'' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. 

'పార్టనర్' , 'వైఫ్', 'ఫాంటసీ', 'గర్ల్ ఫ్రెండ్' అంటూ సినిమాలో నలుగురు హీరోయిన్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చెప్పారు. ట్రైలర్ మొత్తం కూడా ఎమోషనల్ గా కట్ చేశారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై సీనియర్‌ నిర్మాత కేయస్ రామారావు సమర్పణ ఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ సంగీత మాంత్రికుడు గోపీ సుందర్‌ సంగీతమందిస్తున్నాడు.