టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ 'నోటా', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ఫ్లాపులు అందుకున్నాడు. రీసెంట్ గా అతడు నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో విజయ్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తన తదుపరి సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

దీంతో ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్త దర్శకుల మీద ఆధారపడడం తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ నటిస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాకి డైరెక్టర్ గా పని చేస్తుంది క్రాంతి మాధవ్.

మతిపోగొడుతున్న ఇలియానా క్లీవేజ్ షో.. స్టన్నింగ్ పిక్స్ వైరల్!

గతంలో రెండు హిట్టు సినిమాలు ఇచ్చిన క్రాంతి మాధవ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అలానే విజయ్ తో దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ సినిమా అనౌన్స్ చేశాడు. పూరి అనుభవం ఉన్న డైరెక్టర్ కావడంతో ఈ సినిమాతో హిట్ అందుకుంటానని విజయ్ నమ్మకంగా ఉన్నాడు. మధ్యలో చేయాల్సిన 'హీరో' సినిమాకి మాత్రం కొత్త దర్శకుడు పని చేస్తున్నాడు.

అందుకే ఈ సినిమాను పక్కన పెట్టి పూరి జగన్నాథ్ సినిమాను ముందుగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అలానే 'వరల్డ్ ఫేమస్ లవర్' విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక, తను చూసిన తరువాత విడుదల చేద్దామని నిర్మాతకు చెప్పినట్లు తెలుస్తోంది.

విజయ్ నుండి నెక్స్ట్ వచ్చే సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టి తీరాలి.. లేకపోతే విజయ్ మార్కెట్ లో తేడా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే తన నుండి రాబోయే నెక్స్ట్ రెండు సినిమాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఇక 'హీరో' సినిమా భారీ బడ్జెట్ సినిమా కాబట్టి.. రెండు సినిమాలు హిట్ కొట్టిన తరువాత రిలీజ్ చేస్తే మార్కెట్ పరంగా వాల్యూ ఉంటుంది. అందుకే ఈ సినిమాను కొంతకాలం పాటు పక్కన పెట్టాలని చూస్తున్నారు.