టాలీవుడ్ లో రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. డిఫరెంట్ కథలను ఒకే చేస్తూ అన్ని వర్గాల ఆడియెన్స్ కి దగ్గరవ్వాలని చూస్తున్న విజయ్ ఇటీవల కాలంలో పక్క ఇండస్ట్రీలపై కూడా కన్నేస్తున్నాడు. నోటా సినిమాతో తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సక్సెస్ కొడదామని అనుకున్నాడు.

కానీ ఆ సినిమా ఎలాంటి లాభాల్ని ఇవ్వలేకపోయింది. ఇక అదే తరహాలో డియర్ కామ్రేడ్ సినిమాకి కూడా మంచి బజ్ క్రియేట్ చేసి నాలుగు భాషల్లో రిలీజ్ చేశాడు. తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో స్థానిక సెలబ్రెటీలతో హైప్ క్రియేట్ చేసి మరి భారీగా విడుదల చేశాడు. ఆ సినిమా సక్సెస్ ని ఇవ్వకపోగా దారుణమైన నష్టాలను కూడా మిగిల్చింది.

అయినప్పటికీ విజయ్ నీరాశచెందకుండా పాన్ ఇండియన్ లెవెల్లో మరో సినిమాని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో భారీ యాక్షన్ సినిమాని సెట్ చేస్తున్నాడు. ఫైటర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు.

కథను ఫ్యాన్ ఇండియన్ లెవెల్లో అప్గ్రేడ్ చేస్తున్నారట. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ఫుల్ స్క్రిప్ట్ ను పూరి రెడీ చేస్తున్నాడు. హిందీలో కూడా ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయడానికి కరణ్ జోహార్ ఫైటర్ టీమ్ తో కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఏ సారి ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని విజయ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. మరి అతని ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.