గ్యాప్ ఇవ్వకుండా అసలు రెస్ట్ అనేదే లేకుండా సినిమాలను ఒకే చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ. ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పటికీ వెంటనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ గా మారాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ దిల్ రాజు ప్రొడక్షన్ లో వర్క్ చేయడానికి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

దిల్ రాజు టీమ్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. దిల్ రాజు పుట్టినరోజు సందర్బగా రాత్రి విజయ్ పార్టీకి హాజరయ్యారు. పార్టీకి ప్రముఖ దర్శకులతో పాటు రైటర్స్ యాక్టర్స్ కూడా వచ్చారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. విజయ్ దేవరకొండను శివ నిర్వాణ డైరెక్ట్ చేయబోతున్నాడట.

2020 బిగ్ మూవీస్.. టాలీవుడ్ @2వేల కోట్లు(+)

నిన్ను కోరి - మజిలీ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న శివ ప్రస్తుతం నానితో ఒక సినిమా చేస్తున్నాడు. టక్ జగదీష్ అనే ఆ సినిమా తొందరగానే ఫినిష్ కానుంది.  మజిలీ అనంతరం దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నా శివ నిర్వాణ నాని ప్రాజెక్ట్ అయిపోగానే విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నాడు.

స్టోరీ లైన్ కాన్సెప్ట్ చెప్పిన శివ రౌడీ స్టార్ ని సింగిల్ సిట్టింగ్ లో మెప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాకు సంబందించిన వివరాలు తెలియనున్నాయి. ఇక మరో వైపు విజయ్ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.