టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో డిఫరెంట్ కథను సెట్స్ పైకి తెచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ నేడు అధికారికంగా సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేశారు. మొన్నటివరకు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సినిమాకు సంబందించిన షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్న పూరి జగన్నాథ్ మొత్తానికి కరణ్ జోహార్ తో చేతులు కలిపి సినిమాని స్టార్ట్ చేశారు.

సినిమా వర్కింగ్ ప్రొడ్యూసర్ చార్మీ క్లాప్ తో మొదటి సీన్ ని డైరెక్ట్ చేసిన పూరి విజయ్ దేవరకొండను స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు. ధర్మ ప్రొడక్షన్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు వస్తున్నా వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. అసలైతే విజయ్ కరణ్ జోహార్ తో డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయనున్నట్లు టాక్ వచ్చింది. అలాగే ఫైటర్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి.

అయితే వాటిపై క్లారిటీ రాకముందే ధర్మ ప్రొడక్షన్స్ - పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ లు ఫైటర్ కోసం ఏకమయ్యాయి. సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుందో లేదో తెలియదు గాని సినిమా హిట్టయితే మాత్రం తప్పకుండా విజయ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరీ రౌడీ స్టార్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి. ఇక పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తరువాత చేస్తోన్న సినిమా కావడంతో అంచనాలు కూడా పెరుగుతున్నాయి.