సినిమా ఇండస్ట్రీకి చెందిన మన హీరోలు, హీరోయిన్లు సినిమాల్లో  నటించడంతో పాటు తమకంటూ సొంతంగా బిజినెస్ ఉండేలా చూసుకుంటారు. ఒకరు ప్రొడక్షన్ హౌస్ పెడితే మరొకరు బంగారం వ్యాపారం, మరొకరు మల్టీప్లెక్స్ బిజినెస్ ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు.

కుర్ర హీరో విజయ్ దేవరకొండ కూడా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తన వ్యాపార రంగంలోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పటికే రౌడీ అనే దుస్తుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇంతకీ విజయ్ మొదలుపెట్టనున్న బిజినెస్ ఏంటో తెలుసా..? మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్.

హిట్లు పడుతున్నా.. స్పీడ్ పెంచని స్టార్ హీరోలు!

ఏషియన్ సినిమాస్ తో కలిసి విజయ్ దేవరకొండ ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టనున్నాడు. మహబూబ్ నగర్ లో ఏవీడీ పేరుతో తొలి మల్టీప్లెక్స్ థియేటర్ ని ప్రారంభించబోతున్నాడు. గతేడాది ఏషియన్ సంస్థ మహేష్ తో కలిసి ఏఎంబీ సినిమాను మొదలుపెట్టారు. అలానే అల్లు అర్జున్ తో కూడా ఇలానే మల్టీప్లెక్స్ థియేటర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేతులు కలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలానే పూరి జగన్నాథ్ తో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. రీసెంట్ గా దిల్ రాజు బ్యానర్ లో దర్శకుడు శివ నిర్వాణతో కలిసి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.