హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటించిన లేటెస్ట్ మూవీ టెర్మినేటర్ డార్క్ ఫేట్. ఇండియాలో కూడా భారీ ఎత్తున ఈ యాక్షన్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. టెర్మినేటర్ తెలుగు ట్రైలర్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా విజయ్ మీడియాతో మాట్లాడాడు. 

టెర్మినేటర్ సిరీస్ లో వస్తున్న ఈ ఆరో చిత్రంపై తాను చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. తన బాల్యంలో ఆర్నాల్డ్ సినిమాలు అంతో మధురానిభూతిని కలిగించాయని విజయ్ దేవరకొండ తెలిపాడు. భాషా భేదం లేకుండా హాలీవుడ్ చిత్రాలు ఇండియన్ భాషల్లో కూడా రిలీజవుతున్నాయి. 

ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది. సాహో, సైరా లాంటి చిత్రాలు వస్తున్నాయి. ఏదో ఒకరోజు తెలుగు సినిమాలని హాలీవుడ్ వాళ్ళు డబ్బింగ్ చేసుకుని చూసే పరిస్థితి రావాలి అని విజయ్ తెలిపాడు. 

ఈ తరహా యాక్షన్ చిత్రాల్లో నటించడంపై విజయ్ సరదాగా స్పందించాడు. ఇలాంటి సినిమాలు ప్రభాస్ అన్న లాంటివాళ్లు చేయాలి. నేను బచ్చాగాడిని. ఇలాంటి సినిమాల గురించి మరో 5ఏళ్ల తర్వాత ఆలోచిస్తా అని విజయ్ దేవరకొండ తెలిపాడు.  

విజయ్ దేవరకొండ తదుపరి డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో విజయ్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. సిక్స్ ప్యాక్ ట్రై చేస్తా.. వస్తుందో లేదో తెలియదు అంటూ ఫన్నీగా బదులిచ్చాడు.