హీరోగా బిజీగా గడుపుతూనే విజయ్ దేవరకొండ నిర్మాతగా కూడా అవతారం ఎత్తాడు. విజయ్ దేవరకొండ ఫస్ట్ ప్రొడక్షన్ లో వస్తున్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. పెళ్లి చూపులు ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేలా విజయ్ దేవరకొండ కూడా ప్రమోషన్స్ లోకి దిగాడు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో ఓ సాంగ్ లో పెర్ఫామ్ చేశాడు. నువ్వే హీరో అంటూ రైల్వే స్టేషన్ నేపథ్యంలో సాగే ఈ పాటని ఇటీవల లాంచ్ చేశారు. 

ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ చాలా వెరైటీగా ఉంది. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సాంగ్ లో పెర్ఫామ్ చేయడం అంత ఈజీగా ఏమీ జరగలేదు. నా కొరియోగ్రాఫర్ ని చాలా కష్టపెట్టాను. నా కంటే ఎక్కువగా అతడే శ్రమ పడ్డాడు. 

తారక్ అన్న, బన్నీ అన్న చాలా ఈజీగా డాన్స్ చేస్తారు. నాకు మాత్రం ఈ పాటలో డాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది అని విజయ్ దేవరకొండ తెలిపాడు. షమీర్ సుల్తాన్ దర్శత్వంలో తెరకెక్కుతున్న మీకు మాత్రమే చెప్తా చిత్రంలో వాణి భోజన్ కథానాయికగా నటించింది. అనసూయ కీలక పాత్రలో నటించింది.