డియర్ కామ్రేడ్ చిత్రం ఫ్లాఫ్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండను బాగానే భయపెట్టింది. దానికి తోడు తన ప్రొడ్యూస్ చేసిన మీకు మాత్రమే చెప్తా చిత్రం సైతం వర్కవుట్ కాకపోవటం ఆలోచనలో పడేలా చేసింది. దాంతో తను హీరోగా చేసిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  

ఈ సినిమా రిలీజ్ డేట్ ని అన్ని రకాలుగా చూసి  ఫిక్స్ చేయమని యూనిట్ కు చెప్పారట. దాంతో సినిమా పూర్తై రెడీగా ఉన్నా సంక్రాంతి రేసు కు దూరంగా ఉన్నాడు. దాంతో చిత్ర నిర్మాతలు ప్రేమికుల రోజున ఈ సినిమాని రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేసారు.

'చిరుత' పిల్ల ఘాటు సొగసులు.. క్లీవేజ్ షోతో మత్తెక్కిస్తోంది!

ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోయో ఈ సినిమా రిలీజ్ కు ఓ వారం ముందు నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమా రెడీ అవుతోంది. అయితే నితిన్ విషయంలో విజయ్ దేవరకొండ భయపడటం లేదు.  'ఓనమాలు', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కావటం తో క్రేజ్ నెలకొని ఉంది.  

విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌పై కేయస్‌ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’.  రాశీ ఖన్నా, కేథరిన్‌ థెరీసా, ఐశ్వర్యా రాజేశ్, ఇజాబెల్లా హీరోయిన్లు. ఇప్పటికే రిలీజ్ అయిన... ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మంచి రెస్పాన్స్ వచ్చింది.  

ముఖం నిండా రక్తపు మరకలతో సీరియస్‌గా చూస్తున్న విజయ్‌ లుక్‌ ఇంట్రస్ట్ గా ఉంది.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని, పోస్టో ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.  విజయ్ నటిస్తున్న 9వ సినిమా, క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై రూపొందుతున్న 46వ సినిమా కావడం విశేషం. కెమెరా : జయకృష్ణ గుమ్మడి, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : గోపి సుందర్, ఆర్ట్ : సాహి సురేష్.