రౌడి స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్న విషయం తెలిసిందే. మీకు మాత్రమే చెప్తా అంటూ కొత్తగా ట్రై చేస్తున్న విజయ్ ఆడియెన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. నాని హిరోగా ఎంట్రి ఇచ్చిన చాన్నాళ్లకు ప్రొడ్యూసర్ గా అ! అనే ఒక సినిమాని నిర్మించాడు.

ఆ తరువాత సైలెంట్ అయిపోయాడు. అ! సినిమా పెద్దగా నష్టాలను తేలేదు. అలాగని లాభాలను కూడా అందించలేదు.  ఇక ఇప్పుడు నానిలా సొంతంగా ఎదిగిన కుర్ర హీరో విజయ్ దేవరకొండా చాలా ఫాస్ట్ గా ప్రొడక్షన్ వైపు అడుగులు వేశాడు. నిర్మాతగా మారి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్న రౌడి స్టార్ చాలా పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు.

దర్శకుడైన తరుణ్ భాస్కర్ ని హీరోగా సెట్ చేసుకోవడం అనేది పెద్ద రిస్క్ అయితే దాదాపు సినిమాకు పని చేసిన వారంతా కొత్తవారే కావడం మరింత ఛాలెంజింగ్ డిసిషన్. ఇక ఈ సినిమా ఏ మాత్రం క్లిక్కయినా వెంటనే మరో సినిమా ఏనౌన్స్మెంట్ ఇవ్వడానికి విజయ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.    సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లే దారిలో చాలా మందితో విజయ్ ట్రావెల్ చేశాడు.

అందులో కొంతమంది టాలెంట్ ఉన్న చాలా మంది రైటర్స్ ని చూశాడట. 'మీకు మాత్రమే చెప్తా' హిట్టయితే సెంటిమెంట్ గా విజయ్ నిర్ణయాలకు ఒక బూస్ట్ దొరికినట్టే. హిట్ అందుకుంటే మరిన్ని కొత్త ప్రాజెక్టులను ఒకే చేసే అవకాశం ఉంది. మరి మీకు మాత్రమే చెప్తా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.