కరోనా కారణంగా ప్రస్తుతం ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఎక్కువ సమయం ఇంటి పనులకే కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీ మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడు విజయ్.

ఈ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ తనకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చాడు. విజయ్‌కి కాబోయే అమ్మాయికి సెన్సాఫ్‌ హ్యామర్‌ బాగా ఉండాలట. అంతేకాదు తనకు జాలి హృదయం కూడా ఉండాలని చెప్పాడు విజయ్ దేవరకొండ. దీంతో విజయ్‌కి కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో క్లారిటీ వచ్చేసింది. ఇదే ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు విజయ్‌.

ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునేంత మెచ్యూరిటీ రాలేదన్న విజయ్ దేవరకొండ పెళ్లికి ఇంకా సమయం ఉందని చెప్పాడు. అంతేకాదు అమ్మా నాన్నలు కూడా ప్రస్తుతం లైఫ్‌లో సెటిల్‌ కావాలని చెప్పారట. అందుకే ప్రస్తుతానికి తన దృష్టి అంతా కెరీర్ మీదే ఉందని చెప్పాడు విజయ్ దేవరకొండ. వరస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డ విజయ్‌, ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది.