కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మారోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన అసలైన స్టామినా చూపించాడు. బిగిల్ సినిమాతో వరుసగా మూడవసారి 250కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరోగా తన కెరీర్ లో విజయ హ్యాట్రిక్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. సినిమా సినిమాకి తన మార్కెట్ డోస్ పెంచుతున్న ఇళయతలపతి బిగిల్   దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే

.

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం నిర్మాతలు 180కోట్లకు పైగా ఖర్చు చేశారు. విజయ్ గత సినిమాలు సర్కార్ - మెర్శల్ సినిమాలు కూడా ఇదే తరహాలో టాక్ తో సంబంధం లేకుండా 270కోట్లకు పైగా వసూళ్లను అందుకొని బాక్స్ ఆఫీస్ ఎనలిస్ట్ లకు షాక్ ఇచ్చాయి.

ఇక ఇప్పుడు మూడవసారి కూడా అదే స్టైల్ లో విజయ్ తన క్రేజ్ తో సినిమా కలెక్షన్స్ ని పెంచేశాడు. కేవలం విజయ్ క్రేజ్ తోనే ఈ సినిమాకి సాలీడ్ ఓపెనింగ్స్ అందాయని చెప్పవచ్చు. తమిళనాడులో అయితే దాదాపు బాహుబలి 150కోట్ల కలెక్షన్స్ ని దాటేసినట్లు తెలుస్తోంది.

ఇక దీపావళి హాలిడేస్ తో పాటు యాక్షన్ ప్రియులను సినిమా ఎక్కువగా ఆకర్షించింది. ఫూట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కిన బిగిల్ తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ స్టాండర్డ్ గానే ఉన్నాయి.

ఇలానే మరి కొన్ని రోజులు రాబట్టగలిగితే సినిమా కలెక్షన్స్ మూడు వందల కోట్లు దాటడం పెద్ద సమస్య కాదు. మరి సినిమా ఏ స్థాయిలో వసూళ్ళని అందుకుంటుందో చూడాలి. ఎఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది.