Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి2 రికార్డ్ ని బ్రేక్ చేసిన విజయ్..!

బాక్స్ ఆఫీస్ హీరోల్లో ఒకరైన విజయ్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో రికార్డు అందుకున్నాడు. ఇటీవల విడుదలైన బిగిల్ సినిమా పాజిటివ్ టాక్ తో తమిళనాడు పాత రికార్డులను కుదిపేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నిర్మాతలకు అలాగే బయ్యర్స్ కి సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని అందించింది.

vijay bigil new record in tamilnadu
Author
Hyderabad, First Published Dec 17, 2019, 8:09 AM IST

సౌత్ ఇండస్ట్రీలో టాప్ బాక్స్ ఆఫీస్ హీరోల్లో ఒకరైన విజయ్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో రికార్డు అందుకున్నాడు. ఇటీవల విడుదలైన బిగిల్ సినిమా పాజిటివ్ టాక్ తో తమిళనాడు పాత రికార్డులను కుదిపేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నిర్మాతలకు అలాగే బయ్యర్స్ కి సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని అందించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగిల్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయినప్పటికీ ఇంకా తమిళనాడు థియేటర్స్ లో మినిమమ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా 300కోట్లకు వసూళ్లను అందించిన ఈ సినిమా ఒక్క తమిళనాడులో 140కోట్లకు పైగా లాభాల్ని అందించినట్లు సమాచారం. పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందించింది. గతంలో బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును విజయ్ బ్రేక్ చేశాడు.

ఇక మొత్తానికీ ఇప్పుడు తమిళనాడులో విజయ్ మార్కెట్ డోస్ మరింత పెరిగింది.   సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో విజయ్ ఒకరు. ఇది నిన్నటి వరకు. ఇప్పుడు కలెక్షన్స్ పరంగా తలైవా స్థానానికే విజయ్ ఎసరుపెట్టాడు. బిగిల్ సినిమా ఎవరు ఊహించని విధంగా 300కోట్లకు పైగా వసూళ్లతో తమిళ్ సినిమా స్థాయిని పెంచేసింది. తమిళ్ నాడులో అయితే రోజుకో రికార్డుతో విజయ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చెసింది.

అయితే నెక్స్ట్ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధించాలని విజయ్ టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  విజయ్ నెక్స్ట్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి  ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండడంతో ఆ సినిమాపై సౌత్ లో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఆ ప్రాజెక్ట్ తో విజయ్ 400కోట్లకు టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బిగిల్ కంటే ముందు సర్కార్ 250కోట్లను అందుకుంది.

దానికంటే ముందు వచ్చిన మెర్శల్ 200కోట్లను ఈజీగా అందుకుంది. ఇలా సినిమా సినిమాకు విజయ్ తన బాక్స్ ఆఫీస్ రేంజ్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు.  ఫైనల్ గా నెక్స్ట్ సినిమాతో 400కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే సినిమాకు సంబందించిన ప్రతి విషయంలో విజయ్ ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నాడు,. విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ కూడా ప్రాజెక్ట్ లో నటిస్తుండడంతో \ప్రాజెక్టుకి సౌత్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. సినిమా రిలీజ్ అయ్యాక టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా 200కోట్లవరకు వసూలు చేయగలదని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. విజయ్ మాత్రం మరో మైలురాయిని అందుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios