విజయ్, అట్లీ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం బిగిల్. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో మెర్సల్, తేరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. దీనితో బిగిల్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఈ చిత్రంలో ఓల్డ్ గెటప్ లో, ఫుట్ బాల్ కోచ్ గా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర శాటిలైట్ బిజినెస్ పూర్తయినట్లు తెలుస్తోంది. అదిరిపోయే ధరకు శాటిలైట్, డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయట. 

డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బిగిల్ చిత్రానికి 45 కోట్ల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ సినిమా తర్వాత ఈ స్థాయిలో శాటిలైట్ డీల్ కుదరడం విజయ్ చిత్రానికే సాధ్యమైంది. 

విజయ్ క్రేజ్ చూసి తమిళ సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇక విజయ్ అభిమానులైతే బిగిల్ మానియాతో ఊగిపోతున్నారు.