కోలీవుడ్ లో ప్రస్తుతం విజయ్ బిగిల్ సినిమా హాట్ టాపిక్ గా మారింది. రజినీకాంత్ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరో విజయ్. సినిమా సినిమాకు తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. ఇక ఈ సారి తెలుగు మార్కెట్ పై కూడా విజయ్ ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

గతంలో సర్కార్ - మెర్శల్ సినిమాలు మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నాయి.  దీంతో ఈ సారిబిగిల్ సినిమాను కూడా తెలుగులో భారీగా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రమోషన్ పై మంచి పట్టు ఉన్న నిర్మాత మహేష్ కోనేరు చేతిలో బిగిల్ తెలుగు రైట్స్ ని పెట్టారు. విజిల్ గా తెలుగులో దాదాపు 400థియేటర్స్ లో విజయ్ సినిమా రిలీజ్ కానున్నట్లు టాక్. కుదిరితే తెలుగులో కూడా ప్రెస్ మీట్ లు నిర్వహించి సినిమాకు ప్రమోషన్స్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్.

ఇక ఇదే నెలలో ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.  అక్టోబర్ 12న సాయత్రం 6 గంటలకు బిగిల్ ట్రైలర్ ని తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. తేరి - మెర్సల్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం అట్లీ విజయ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో అంచనాలు మాములుగా లేవు. మొదటిరోజే ఈ సినిమా ఊహించని కలెక్షన్స్ ని అందుకుంటుందని కోలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది. మరి సినిమా తెలుగులో  ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.